Welcome సుస్వాగతం
Welcome to Mahatma Gandhi Institute for Comprehensive Mental Healthcare (MGICMH) !
మహాత్మ గాంధి సమగ్ర మానసిక సంరక్షణ సంస్థ (MGICMH) తరఫున మీ అందరికీ స్వాగత సుమాంజలులు.
MGICMH is a mental health unit which runs as a not-for-profit organisation based in Guntur town, Andhra Pradesh state, India.
MGICMH ఇండియాలోని ఆంధ్ర ప్రదేశ్ లో వున్న గుంటూరులో స్థాపించబడిన, లాభాపేక్ష లేకుండా నడపబడుతున్న ఒక సంస్థ.
MGICMH is a 13 bedded in-patient mental health unit. It has out-patient facilities as well. The unit consists of multidisciplinary mental health team i.e. psychiatrists, psychologists, mental health nurses, occupational therapists, psychiatric social workers and care workers.
MGICMH లో 13 పడకలతో పాటు, ఔట్ పేషెంట్ సౌకర్యాలు కూడ ఉన్నాయి. ఈ ఆసుపత్రిలో సైకియాట్రిస్టులతో పాటు, సైకాలజిస్టులు, మానసిక సమస్యల విభాగంలో శిక్షణ పొందిన నర్సులు, ఆక్యుపేషనల్ థెరపిస్టులు, సోషల్ వర్కర్లు, సహాయ సిబ్బంది కలిసిన బహుళ విభాగ టీమ్ (మల్టి డిసిప్లినరీ టీమ్) వున్నది.
MGICMH is run by Empower charitable trust based in Guntur. Empower trust received exemption under section 12A and 80G of the Indian Income Tax Act. It has been approved to receive donation from foreign donors under FCRA act.
మహాత్మ గాంధి సమగ్ర మానసిక సంరక్షణ సంస్థ (MGICMH) గుంటూరు లో వున్న ‘ఎంపవర్’ అనే సేవా సంస్థ నడుపుతున్న ఆసుపత్రి. ఎంపవర్ సేవా సంస్థ, భారత ప్రభుత్వ ఇన్ కం టాక్సు చట్టంలోని సెక్షన్ 12ఏఏ మరియు 80జి ప్రకారం పన్ను మినహాయింపులు పొంది వున్నది. విదేశాలలోని దాతల నుండి డొనేషన్లు పొందడానికి FCRA చట్టం క్రింద కేంద్ర ప్రభుత్వ అనుమతులు కూడా కలిగి వున్నది.
MGICMH was initially supported by Hamlet trust based in London. It now has a working collaboration with ‘NIDUS-UK’.
లండన్ లోని ‘హామ్ లెట్ ట్రస్టు’ మొదట్లో ఎంపవర్ సంస్థ కు సహకారం అందించింది. ప్రస్తుతం ‘నైడస్- యూకె ట్రస్టు’ ఎంపవర్ కు సహకారం అందిస్తున్నది.