పేషెంట్స్ యొక్క కుటుంబ సభ్యుల అభిప్రాయాలు
(Following are feedback statements from carers & families of our patients about our service. Many of them have provided the feedback in Telugu language which was translated to English. On occasions, interpretations were used to keep it brief. Scanned copies of original verbatims of all feedback can be provided on request, if you are keen to see them – MGICMH )
(క్రింద మా వైద్యవిధానాల గురించి, మా వద్ద వైద్య సహాయం పొందిన పేషెంట్స్ యొక్క కుటుంబసభ్యుల అభిప్రాయాలను పొందుపరచాము. రాతపూర్వకంగా మా వద్ద వున్న, ఈ అభిప్రాయలు కంప్యూటర్లో స్కాన్ చేసి వున్నాయి. ఎవరికైనా అవసరం అనిపిస్తే, మా సిబ్బందిని అడగవలెనని మనవి, మేము ఆ కాపీలు మీకు పంపుతాము – MGICMH)
” My brother has been suffering with bipolar disorder for many years. We went to 4 hospitals which are providing services for mental health problems. But the way we were received here was different from those, I feel the doctors here not only concentrated on the symptoms and drug treatment, but they included us (the family members) in the treatment planning.
I hope those sessions will definitely help us for managing him at home better than before. In budding stage itself this hospital is providing excellent service…I wish all the best for the team & MGICMH “…. Mr V.R. (Translated from Telugu)
మా అన్నయ్య చాల సంవత్సరాలుగా ఉన్మాద వ్యాధి (బైపోలార్ డిజార్డర్) నుండి బాధ పడుతున్నాడు. ఆయన వైద్యం కొరకు ఇంత వరకు మేము 4 మానసిక ఆసుపత్రులకు వెళ్లాము. కానీ ఇక్కడ మమ్మల్ని ఆదరించినట్లు ఎవ్వరూ ఆదరించలేదు. ఇక్కడ కేవలం జబ్బు లక్షణాలు మరియు మందుల మీదే వారి దృష్టి కేంద్రీకరించకుండా, మా అన్నయ్య యొక్క చికిత్స ప్రణాళికలో, మా (కుటుంబ సభ్యుల) అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.
ఇలా మమ్మల్ని (కుటుంబసభ్యులను) కూడా సంప్రదించడం, మాకు మా అన్నయ్య జబ్బు గురించి వివరించడం, లక్షణాలు ఇబ్బందికరంగా మారినప్పుడు మేము ఎలా ప్రవర్తించాలో చక్కగా వివరించడం వలన, మాకు కూడా మనో ధైర్యం కలిగింది. మా అన్నయ్య జబ్బును అంతకు ముందుకంటే బాగా నయం చేసుకోవడానికి అవకాశం కల్గింది…. ప్రారంభించిన కొద్ది రోజులలోనే, అద్భుతమైన సేవ అందిస్తున్న ఈ హాస్పిటల్ కు (MGICMH), ఇక్కడ పని చేస్తున్న సిబ్బందికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను – వి.ఆర్.
” We admitted my mother in law who was suffering with OCD for more than 20 years. The nursing care was very good. The atmosphere was peaceful. Conducting group activities were much useful in our case. Change was noticed in her thinking.
I hope this will definitely improve our Quality Of Life. Here the services are not limited to centre based, we felt very happy and relaxed when they extended their service & support with home visits, regularly enquiring regarding her health over phone and providing support whenever necessary, I wish success for the team “…Mrs S, Guntur.
అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (OCD) అంటే అతి చాదస్తంతో 20 సం. లు గా బాధ పడుతున్న మా అత్త గారిని ఇక్కడ అడ్మిట్ చేసాము. ఇక్కడ నర్సింగ్ సేవ బాగుంది. ఆసుపత్రి వాతావరణం కూడా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడి సిబ్బంది అందించిన గ్రూప్ కార్య కలాపాలు, మా అత్తగారి విషయంలో బాగా ఉపయోగపడ్డాయి. ఆమె ఆలోచనా విధానంలో మెరుగుదల కనిపించింది.
ఈ ట్రీట్ మెంట్ వలన మా కుటుంబ జీవితంలో నాణ్యత పెరుగుతుంది అని ఆశిస్తున్నాను. ఈ ఆసుపత్రిలో అందించే సేవలు కేవలం ఆసుపత్రికి పరిమితం కాకపోవడం, అవసరమైనప్పుడు ఇంటికి వచ్చి సేవలు అందించడం వలన, మా అందరికి కొంత విశ్రాంతి కలిగి, సంతోషంగా అనిపించింది. అంతేగాక డిశ్చార్జి తర్వాత, ఇక్కడి సిబ్బంది ఇంటికి ఫోను చేసి, మా అత్తగారి బాగోగులు అడగడం, అవసరమైనప్పుడల్లా సహాయం అందించడం వంటివి మాకు చాల ఉపయోగపడ్డాయి. ఈ ఆసుపత్రి చికిత్సా బృందానికి అన్ని విధాలా విజయం చేకూరాలని ఆశిస్తున్నాను. – శ్రీమతి ఎస్. గుంటూరు
” We are fully satisfied for the hospitality and treatment given by the respective doctors of MGICMH and there is a lot of improvement in the behaviour as well as health side of our daughter “…………..Mr SVRKP & Mrs AP, Tenali, Guntur Dist. (Translated from Telugu)
ఈ ఆసుపత్రి (MGICMH)లో పనిచేసే డాక్టర్లు మరియు ఇతర సిబ్బంది, మాకు ఇచ్చిన ట్రీట్ మెంట్ మరియు ఆదరణతో మేము పూర్తిగా సంతృప్తి చెందాము. మా అమ్మాయి ఆరోగ్యంలో మరియు ప్రవర్తనలో చాల మెరుగుదల వచ్చింది. – శ్రీ ఎస్.వి.ఆర్.కె.పి & శ్రీమతి ఏ.పి. తెనాలి, గుంటూరు జిల్లా
” My mother was suffering from psychological problem since 10 -12 years. Her mental illness has escalated and ended up with having severe problems within the family as well as neighbours. After consulting many places we came across this trust and admitted her expecting some recovery. After undergoing some medication and counselling sessions for the period of 20 days I feel my mother has recovered partially sufficient enough to sustain in this society without much problems.
I am very happy about my mother now. Doctors are friendly, logical and trustworthy personnel. All supporting staff are really admirable. Also doctors have extended their support even when my mother was out of hospital. My heartfelt thanks to all the personnel involved in her treatment “……..Mr NP, Kankipadu, Krishna District
మా అమ్మ 10-12 సం. ల నుండి మానసిక సమస్యతో బాధ పడుతుంది. ఆమె మానసిక సమస్య వలన మా కుటుంబంలో మరియు మా ప్రక్కింటి వాళ్లతో చాల పెద్ద సమస్యలు వచ్చాయి. చాల చోట్ల సంప్రదించిన తర్వాత, మాకు ఈ ట్రస్టు ఆసుపత్రి గురించి తెలిసి, ఇక్కడ మా అమ్మను అడ్మిట్ చేసాము. మందులతో పాటు, కౌన్సిలింగ్ చేయడం వలన 20 రోజుల్లో ఆమె లక్షణాలు పూర్తిగా అదృశ్యం కాక పోయినా కూడ, సమాజంలో ఇతరులతో సమస్యలు కలగకుండా ఉండటానికి అవసరమైనంతగా తగ్గాయి.
మా అమ్మ విషయంలో ఇప్పుడు నేను చాల సంతోషంగా వున్నాను. ఇక్కడ పనిచేసే డాక్టర్లు చాల స్నేహంగా, తార్కికంగా ఆలోచించే వారు మరియు నమ్మదగిన వారు. ఇక్కడ పని చేసే సహాయక సిబ్బంది కూడా ప్రశంసించదగిన వారు. మా అమ్మ డిశ్చార్జి అయిన తర్వాత కూడా ఇక్కడి డాక్టర్లు సహాయం అందించారు. ఆమె ట్రీట్ మెంట్ లో పాత్ర వహించిన సిబ్బంది అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.- ఎన్.పి. కంకిపాడు, కృష్ణా జిల్లా.
” I admitted my wife here for mental health problem. Here in MGICMH, the staff were cooperative and helpful. Doctors were very professional and friendly. We liked the way the treatment was given and timely follow ups and friendly nature of all the staff here. We sincerely thank you (The trustees and Donors) for being in the cause, the staff, doctors and supporting them by donating and supporting in all the ways that you can ” ……..Mr MGR, Kakinada
నా భార్య మానసిక సమస్య వైద్యం కొరకు MGICMH లో అడ్మిట్ చేశాను. ఇక్కడ స్టాఫ్ స్నేహపూర్వకంగా మరియు సహాయకరంగా వుంటారు. డాక్టర్లు కూడా వృత్తిపరమైన నైపుణ్యతతో పాటు స్నేహ తత్వం కలిగిన వారు. మాకు ఇక్కడ ట్రీట్ మెంట్ ఇచ్చిన విధానంతో పాటు, డిశ్చార్జి తర్వాత వీరు ఇచ్చిన మద్దతు చాల నచ్చింది. ఈ ఆసుపత్రి స్థాపనకు, నడపడానికి అవసరమైన డొనేషన్ లతో పాటు, వీలైనన్ని విధాలా సహాయం అందిస్తున్న దాతలకు, మేము నిజాయితీతో ధన్యవాదాలు అర్పిస్తున్నాము. – ఎం.జి. ఆర్. కాకినాడ.
I live in Visakhapatnam. My parents live in Guntur. I came here along with my 5 years old son, who was attending formal school for the last 2 years. His speech was fair but he was poor in writing skills, his attention was poor and had difficulty in holding pencil too. Out of frustration I used to punish him a lot.
One day he pushed his cousin from upstairs and other day he stood on the neck of my younger child. I was very concerned about his behaviour and then we decided to consult a specialist. After enquiring in Guntur, my sister told me this was the suitable place for him to address his problem.
Here he was assessed by professionals in detail. I and my husband were included in each and every step. The psychologist explained to us how my son’s problem in writing was connected to problems in his behaviour. It made sense to me and my husband.
Initially we attended a daily day programme for a week which included activities for my son and training for me. With the training I developed knowledge about my child’s problem and learned activities for home based management. Thereafter, my son started attending school for half day in the morning. During the afternoon hours at home, I used to complete the work with my son for his writing problem.
All the activities were with low cost and no cost material. Day by day I had realised role of my involvement in his progress. We continued attending programme at MGICMH with regular intervals, with a plan of action for home based management. Now there is significant improvement in his behaviour.
I want to mention one thing to the parents who come here, it is not only the responsibility of a professionals, it is our responsibility to put efforts to make things better for our children. Definitely result will be in your side. All the best to every body ” …….. Mrs SJ, Visakhapatnam (Translated from Telugu)
నేను విశాఖపట్నంలో వుంటాను. మా తల్లిదండ్రులు గుంటూరులో వుంటారు. నేను మా 5 సం. రాల అబ్బాయితో గుంటూరు వచ్చాను. మా బాబు గత 2 సం. రాలుగా స్కూలుకి పోతున్నాడు. మా బాబు మాట పర్వాలేదు కాని, రాయడంలో సమస్య ఉండేది, ఏకాగ్రత కూడ తక్కువే, పెన్సిలు కూడ సరిగా పట్టుకునే వాడు కాదు. నాకు కోపం వచ్చి చాల సార్లు కొట్టే దానిని.
ఒక రోజు మా బాబు తన బాబాయి కొడుకును పై నుండి తోసేసాడు, మరోసారి తన తమ్ముడి మీద మీద కాలు పెట్టి నిలబడ్డాడు. వాడి ప్రవర్తన నాకు చాల ఆందోళన కలిగించి, నిపుణుడిని సంప్రదించేలా చేసింది. గుంటూరు వచ్చినపుడు నేను కనుక్కుంటే, మా బాబు ప్రవర్తన సమస్యను పరిష్కరించడానికి, ఈ ఆసుపత్రి సరైనది అని మా అక్క చెప్పింది.
ఇక్కడ నిపుణులు మా బాబు సమస్యను సమయం వెచ్చించి, వివరంగా కనుక్కున్నారు. నన్ను, మా ఆయనను ప్రతి సారి కౌన్సిలింగ్ లో పాల్గొనే విధంగా చేశారు. మా బాబు రాత సమస్యకూ, అతని ప్రవర్తనకూ మధ్య ఏ విధంగా సంబంధం వున్నదో, ఇక్కడి సైకాలజిస్టు మాకు అవగాహన కలిగించేలా చేసారు. ఇందుమూలంగా, ఒక రకంగా నాకు, మా ఆయనకు జ్ఞానోదయం కలిగినట్లుగా అయింది.
మొట్టమొదట, ఒక వారం పాటు రోజు మా బాబును దైనందిక కార్యక్రమంలో అలవాటు చేసి నాకు కూడ శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ వలన మా బాబు సమస్యపై నాకు అవగాహన కలగడంతోపాటు, మా బాబుతో ఇంటి దగ్గర చేయవలసిన ప్రోగ్రాములో నేను చేయవలసిన పనులపై పట్టు వచ్చింది. ఆ తర్వాత మా బాబును ఉదయం పూట మాత్రమే స్కూలుకు పంపాము. మధ్యాహ్నం నేను ఇంటిదగ్గర మా బాబుతో, అతని రాత సమస్య కోసం హాస్పిటల్ వారు ఇచ్చిన ప్రోగ్రాము ప్రకారం చేయించేదానిని.
వీరు ఇచ్చిన ప్రోగ్రాములో కొనవలసిన ఐటమ్స్ చాల తక్కువ ఖర్చుతో కూడినవి లేదా అసలు ఖర్చు లేనివి. ఇంటి వద్ద నేను ఈ ప్రోగ్రాము చేస్తున్న కొద్దీ, రోజురోజుకూ, మా వాడి సమస్యను పరిష్కరించడంలో, నా పాత్రపై నాకు, ఇంకా ఎక్కువ అవగాహన కల్గింది. మధ్యలో మేము (MGICMH) గుంటూరుకు అపాయింట్ మెంట్ ప్రకారం, క్రమం తప్పకుండ, విశాఖపట్నం నుండి వచ్చి, మళ్ళీ వచ్చే 2-3 వారాలకు అవసరమైన ప్రోగ్రాం ఎలాచేయాలో తెలుసుకునే వాళ్లం. ఇప్పుడు మా బాబు ప్రవర్తనలో చాల మెరుగుదల వచ్చింది.
ఇక్కడకు వచ్చే తల్లిదండ్రులకు ఒక విషయం చెప్తాను, మన పిల్లల ప్రవర్తనా సమస్యల కోసం వచ్చినపుడు, వాటిని పరిష్కరించవలసిన బాధ్యత, కేవలం ఆసుపత్రి స్టాఫ్ పైన మాత్రమే ఉండదు, మనం కూడా సమస్యను అర్థం చేసుకుని ప్రోగ్రాంలో పాల్గొనవలసి ఉంటుంది, ఎంతో కృషి కూడ చేయవలసి ఉంటుంది. అప్పుడే తప్పకుండ ఫలితం మీకు దక్కుతుంది. అందరికీ మంచి జరగాలని నా శుభాకాంక్షలు. – శ్రీమతి ఎస్.జె. విశాఖపట్నం.
We are a small agricultural family and I work in Guntur market as daily labourer. We have 2 children who are in 10th and 8th class. We came here because my wife was disturbed mentally after an argument with a neighbour. She became extremely fearful, used to complain head ache all the time and stopped domestic work. She became very suspicious complaining ’people were talking about her’. She used to experience some voices (talking about her), we failed to convince her there was nothing.
Meanwhile we enquired about treatment for this we came to know about MGICMH . The entrance itself was beautiful with greenery and flowers. I was worried about the cost of treatment (because this is something related to brain, require MRI etc costly procedures, costly medicines) but the administrator explained us about the organisation (Non-profit) and treatment cost would depend on the family ‘s economic status.
After initial assessment, we were explained the problem in detail and the progress was supervised by the staff regularly. We stayed here as inpatient for few days and advised for regular follow up. Here the room and other facilities were good. This hospital is helping to poor persons like us.
Our sincere thanks to the donors who are helping this organisation financially. Here treatment was given to my wife, but indirectly our family has survived from a big problem. Our family is always indebted to this hospital…..K.A.R. Namburu village, Guntur district.
(Translated from Telugu)
మాది వ్యవసాయం చేసుకుని బ్రతికే చిన్న కుటుంబం, నేను గుంటూరు మార్కెట్లో రోజు కూలి పని కూడ చేస్తుంటాను. మాకు 8వ తరగతి, 10వ తరగతి చదివే ఇద్దరు పిల్లలున్నారు. మా ఇంటి పక్కావిడతో వాదన అయ్యి, నా భార్య మతిపై ప్రభావం పడటం వలన మేము ఈ ఆసుపత్రికి వచ్చాము. ఆమెలో అతిగా భయం మొదలయ్యింది, ఎప్పుడూ తలనొప్పి అనేది, క్రమక్రమంగా ఇంట్లో పని చేయడం కూడ మాని వేసింది. ఒక్క సారిగా అనుమానాలు మొదలయ్యాయి, ‘బయటి వాళ్ళు నా గురించి మాట్లాడుకుంటున్నారు’ అని అనేది. ఆమెకు ఎవరో మాట్లాడుకున్నట్లు మాటలు వినిపించేవి, మేము అదేమీ లేదని ఎంత చెప్పినా ఆమె నమ్మేది కాదు.
ఈ సమయంలో నేను కొందరిని గుంటూరులో కనుక్కుంటే ఈ ఆసుపత్రి (MGICMH) గురించి తెలిసింది. మేము ఆసుపత్రిలో వెళ్ళగానే పచ్చదనంతో అందంగా అనిపించింది. ఎంత ఖర్చు అవుతుందో అని నేను భయపడ్డాను (మెదడుకు సంబంధించిన సమస్య కాబట్టి MRI వంటి ఖరీదైన టెస్టులు అవసరం అవుతాయేమో, మందులు కూడా ఖరీదైనవి వుంటాయేమో అని). కాని ఇక్కడి సిబ్బంది నాకు వివరించి చెప్పారు, ఈ ఆసుపత్రిలో వైద్యం లాభాపేక్ష లేకుండా చేస్తారు, పేషెంట్ ల ఆదాయాన్ని బట్టి ఫీజుల్లో రాయితీలు ఇస్తారు అని.
మా ఆవిడను మొదటిసారి చూసిన తర్వాత, మళ్లీ వివరంగా చూసి, మాకు ఆవిడ సమస్య గురించి వివరంగా చెప్పి, క్రమం తప్పకుండ ఆమె ట్రీట్ మెంట్ జాగ్రత్తగా పర్యవేక్షించారు. మొదట కొన్నాళ్లు, ఇక్కడ అడ్మిట్ చేసిన తర్వాత అవుట్ పేషెంట్ గా వైద్యం చేసారు. ఇక్కడ రూము తదితర సౌకర్యాలు బాగున్నాయి. ఈ ఆసుపత్రి వలన మాలాంటి పేద వాళ్లకు చాల సహాయం అవుతుంది.
ఈ ఆసుపత్రికి ఆర్థికంగా సహాయపడుతున్న దాతలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ నా భార్యకు ట్రీట్ మెంట్ ఇచ్చినందుకు, మా కుటుంబం పెద్ద ఆపద నుండి బయటపడింది. మా కుటుంబం ఈ ఆసుపత్రికి సదా రుణపడి వుంది. – కె.ఏ.ఆర్, నంబూరు గ్రామం, గుంటూరు జిల్లా