It is hard to define and achieve outcomes in the field of rehabilitation of psychiatric patients, in particular, in the context of NGO model which does have no support from the government whatsoever and has to depend mainly on payments made by families of patients and by occasional donations from good-hearted public. Despite these mighty challenges, we feel that the achievements we made should not be totally overlooked by the society and the world. We have started evaluation of our service in a crude manner, we still feel it is worth it. Accordingly, we gather feedback from all the inpatients and their families. We present the following cases (names changed) for the perusal of wider public.
మానసిక రోగుల పునరావాసం లో సఫలత ను నిర్వచించడం మరియు సాధించడం కష్టమైన విషయం. ప్రభుత్వ సహాయం లేకుండా, కేవలం దాతలు మరియు కుటుంబ సభ్యుల చెల్లింపు ల పైన ఆధారపడే స్వచ్ఛంద సంస్థలకు ఇది చాలా కష్టం తో కూడుకున్న విషయం.
అయినప్పటికీ ఈ రంగంలో మేము సాధించిన ఫలితాలను, విజయాలను ప్రజలు మరియు బయటి ప్రపంచం తో పంచుకోవాలని భావిస్తున్నాం. పూర్తిగా పరిపక్వమైన విధానం కానప్పటికీ, మా సేవలను మరియు వాటి ఫలితాలను అంచనా వేయడం ప్రారంభించాం. అందులో భాగంగా మా వద్ద సేవ పొందినమానసిక రోగుల మరియు వారి కుటుంబ సభ్యుల అభిప్రాయాలను సేకరించాం.
అందులో నుండి కొన్నిఉదాహరణలను ప్రజా బాహుళ్యానికి తెలియచేయడానికి క్రింద ఉదాహరిస్తున్నాం.
Rajesh is a 21 year old single young man who lives with his parents who work as daily labourers. He has a brother and two sisters. He has moderate learning disability and also suffers from treatment resistant schizophrenia. His father misuses alcohol and blames his drinking on his social circumstances. Rajesh was also dependent on chewing tobacco product called MC and used to snatch these packets from small shops. He used to talk to himself and was verbally and physically aggressive towards his family members. For this reason he was chained to his bed with both hands and legs tied with a metal chain for 3 years prior to his admission to MGICMH. Rajesh’s father used to stay at home with a view to look after Rajesh which affected the family income. Rajesh was admitted to MGICMH for 6 weeks and received intensive treatment with Clozapine. His Ghutka habit was also addressed during the inpatient treatment. At the time of discharge, he was relieved from a prisoner state to a free person. He now carries out small scale activities and attends day treatment unit on a daily basis which provides a respite for the family. As a part of family intervention, Rajesh’s father’s dependence on alcohol was also addressed. Rajesh’s father also now attends for his work and family is now functioning at its maximum capacity. Rajesh was charged only Rs 150 a day for inpatient treatment which included accommodation, daily services for psychiatry, rehabilitation psychology, mental health nursing, occupational therapy and family therapy. The story is not over and it continues…….Rajesh and his family need an ongoing support on a long-term basis.
21 సంవత్సరాల రాజేష్ అవివాహితుడు. రాజేష్ ఒక మోస్తరు బుద్ధిమాంద్యంతో పాటు మందులతో సరిగ్గా పని చేయని స్కిజోప్రెనియా వ్యాధితో బాధపడుతున్నారు. రాజేష్ తల్లితండ్రులు ఇద్దరూ రోజు కూలీలు. తండ్రి మద్యపానం కు అలవాటు పడి ఉండడం వలన తన సాంఘిక పరిస్ధితులను నిందిస్తూ ఉండేవారు. రాజేష్ తన తల్లితండ్రుల తో కలిసి ఉండేవాడు. అతనికి ఒక తమ్ముడు మరియు ఇద్దరు చెల్లెళ్లు కూడా ఉన్నారు. రాజేష్ MC గుట్కా (పొగాకు ఉత్పత్తి) వాడకానికి బానిస అయివున్నాడు. అతడు చిన్న చిన్న దుకాణాల నుండి MC పొట్లాలను లాక్కున్నేవాడు, తనలో తాను మాట్లాడుకునే వాడు, కుటుంబ సభ్యులను దుర్భాషలు మాట్లాడడం మరియు కొట్టడం లాంటివి కూడా చేసేవాడు. MGICMH కు రాక ముందు, కుటుంబ సభ్యులు రాజేష్ కాళ్ళూ, చేతులను మంచానికి గొలుసులతో 3 సంవత్సరాలు గా కట్టివేసి ఉంచారు. రాజేష్ ను చూసుకునేందుకు అతని తండ్రి ఇంటి వద్దనే ఉండేవాడు, ఫలితంగా ఇంటి ఆదాయం తగ్గిపోయింది. రాజేష్ MGICMH లో 6 వారాల పాటు చేర్పించి , CLOZAPINE అనే మందుతో చికిత్స ఇవ్వడం జరిగింది. అదే సమయంలో గుట్కా అలవాటు మాన్పించే చికిత్స కూడా జరిగింది. ఆసుపత్రి నుంచి విడుదల అయ్యే అప్పటికి రాజేష్ ఒక బందీ దశ నుంచి పూర్తి స్వతంత్రుడు గా మార్పు చెందాడు. కుటుంబ సమస్యలను మెరుగు పరిచే దిశగా రాజేష్ తండ్రి మద్యపాన సమస్యను కూడా పరిష్కరించడం కూడా జరిగింది. రాజేష్ తండ్రి ఇప్పుడు తన పనులకు వెళ్ళడం ద్వారా, కుటుంబం అంతా తమ సామర్ధ్యం మేరకు పనిచేస్తున్నారు. MGICMH లో ఉన్నప్పుడు వసతి, మానసిక వైద్యులు, నర్సులు, సైకాలజీ, వృత్తి నైపుణ్యం పెంచే చికిత్స, కుటుంబ చికిత్స వంటి వివిధ చికిత్స లకు గాను, కుటుంబ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని, చాల తక్కువ ఫీజు తో వైద్యం చేయడం జరిగింది. రాజేష్ కథ ఇంకా పూర్తి కాలేదు, తన కుటుంబాన్ని కి అవసరమైన సహాయ సహకారాలు MGICMH నుంచి దీర్ఘకాల ప్రాతిపదికగా అందిస్తూనే ఉంటుంది.
Kamala is a 25 year old unmarried woman who lives together with her parents and her brother’s family. Prior to relapse of her symptoms, Kamala used to work as a helper in a shop. She was admitted to MGICMH after she suffered from symptoms of Schizophrenia. Her family was very distressed because Kamala used to argue with everyone in the house and to accuse them of snatching the house from her in-laws. She used to hold paranoid delusions and to talk to herself. Prior to her admission to MGICMH she was admitted to psychiatric units 4 or 5 times and also received Electro Convulsive Therapy (ECT) number of times with a brief spell of improvement. Kamala was diagnosed to suffer from Treatment Resistant Schizophrenia and was treated with Clozapine at MGICMH. She was admitted for 1 month during which her symptoms resolved to a maximum extent. Subsequent to discharge she was invited to attend for day activities for few days before she started to work again as a helper in the shop she used to work before. Although she is not totally free of her symptoms due to intolerance of high doses of antipsychotics, she is able to go to work on a regular basis and is able to get on with her family members. Kamala was also charged Rs 150 per day for the inpatient treatment she received due to her family’s low income status. Again Kamala’s story is not over……….She and her family need a continued support from MGICMH on a long-term basis. Both Rajesh and Kamala need monitoring of their blood counts as per protocol for the treatment with Clozapine on a weekly basis initially for 18 weeks followed by fortnightly monitoring for a year.
25 సంవత్సరాల కమల అవివాహిత. ఆమె తన తల్లితండ్రులు మరియు సోదరుడి కుటుంబము తో కలసి ఉంటుంది . స్కిజోఫ్రీనియా వ్యాధికి గురి కాకముందు ఆమె ఒక షాపులో పనిచేసేది . వ్యాధి లక్షణాలు తీవ్రముగా ఉన్నప్పుడు ఆమెను MGICMH లో చికిత్య కోసం చేర్పించారు. వ్యాధి లక్షణాలలో భాగంగా ఆమె తన కుటుంబసభ్యులపైన ఆధారము లేని అనుమానాలను కలిగి ఉండేది. కుటుంబసభ్యులు తన ఆస్తిని కాజేయాలని ప్రయత్నిస్తున్నారని వారితో గొడవ పడేది . MGICMH రాకముందు ఆమె 4, 5 సార్లు వివిధ మానసిక ఆసుపత్రులలో చేరడం, ECT చికిత్స (కరెంటు షాకులుగా సామాన్య ప్రజలు పిలుస్తుంటారు) కూడా ఇవ్వడం జరిగింది. కానీ, కొంతకాలం ఉపశమనం తరువాత కమల వ్యాధి లక్షణాలు తిరిగి మళ్లీ కనిపించేవి. MGICMH లో కమలను చికిత్సకి స్పందించని స్కిజోఫ్రీనియా (Treament reisistant Schizophrenia) గా గుర్తించి , నెల రోజుల పాటు ఆసుపత్రి లో ఉంచి Clozapine అనే మందుతో చికిత్స మొదలుపెట్టారు. Clozapine చికిత్స ద్వార కమల వ్యాధి లక్షణాలలో గణనీయమైన మార్పు వచ్చింది . MGICMH ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయినా తరువాత కమల రోజువారీ కార్యక్రమాలలో పాల్గొనేందుకు ప్రోత్యహించడం జరిగింది. దాని ద్వారా క్రమేపి తాను మళ్లీ పనిచేసే షాప్ కి వెళ్లగలుగుతుంది. తాను వాడే మందులు వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉన్నప్పటికీ, కమల తన పని తాను చేసుకుంటూ, కుటుంబసభ్యులతో గొడవ పడకుండా ఉండగలుగుతుంది. తక్కువ ఆదాయం కారణముగా కమల కు ఆసుపత్రి లో ఉన్నపుడు చాలా తక్కువ ఫీజుతో వైద్యం చేయడం జరిగింది. కమల కథ ఇంకా మిగిలి వుంది …. ……ఆమెకు, ఆమె కుటుంబసభ్యులకు MGICMH నుంచి దీర్ఘకాల సహాయం అవసరం ఉంటుంది. Clozapine చికిత్స లో భాగముగా కమలకు 18 వారములు పాటు ప్రతి వారము రక్త పరీక్షలు , ఆ తరువాత ఒక సంవత్సరము వరకు ప్రతి 2 వారములకు ఒకసారి రక్త పరీక్షలు చేయవలసి ఉంటుంది.
Kareemulla is a 33 year old vegetable vendor who lives with his wife and two young daughters. He approached MGICMH with a problem of alcohol dependence. He used to spend Rs 800 per day to buy alcohol by taking loans. He had to sell his house and his business was affected very badly. He also had to spend about 1 lakh rupees for the treatment of problems with his stomach, Liver and Pancreas in a private hospital. Despite 2 admissions to gastroenterology unit, he continued to drink till he was admitted to MGICMH. He stayed in MGICMH for 15 days as inpatient for detoxification followed by daily attendance for the group for alcoholics held at MGICMH for 15 days. Despite all these efforts, he drank alcohol one day which upset his young wife who brought him back to MGICMH for help. Fortunately he stopped drinking alcohol immediately and continues to attend the group on a weekly basis. Kareemulla was charged slightly higher than patients below poverty line due to his better financial position in general.
33 సంవత్సరాల కరీముల్లా కు భార్య, ఇద్దరు పిల్లలు. కూరగాయలు అమ్మడం అతని జీవనోపాధి. కరీముల్లాను అతని తోడల్లుడు మద్యపాన సమస్య గురించి MGICMHకు తీసుకురావడం జరిగింది. రోజుకి 800 రూపాయిలు తన మద్యపానము పై ఖర్చుచేసేవాడు. మద్యపానం మూలంగా అయిన అప్పుల వల్ల వ్యాపారం దెబ్బతినడం వల్ల, చివరికి సొంత ఇంటిని అమ్ముకోవలసి వచ్చింది. మద్యపానం వల్ల కాలేయం (Liver) మరియు క్లోమ గ్రంధి (Pancreas) దెబ్బతినడం వల్ల ప్రైవేట్ ఆసుపత్రి లో 2 సార్లు చేరడం ద్వారా లక్ష రూపాయలకు పైన ఖర్చు చేసారు, అయినా తన త్రాగుడు మాత్రం మానలేదు. MGICMH నిపుణుల సలహా మేరకు, కరీముల్లా ని అతని బంధువులు 15 రోజుల పాటు ఆసుపత్రి లో చేర్పించారు. ఆ 15 రోజులలో కరీముల్లా కి detoxification చికిత్స చేసినారు. మద్యపానం అధికముగా సేవించేవారు ఆ అలవాటు మానినపుడు, వారికి చేతులు వణకడం, విపరీతమైన ఆందోళన, చెమటలు పట్టడం, నిద్ర పట్టకపోవడం వంటి లక్షణాలు మొదలుకొని మూర్ఛలు (Fits) సంధి (Delirium) వంటి ప్రాణాంతకరమైన విపరీత లక్షణాలు సంభవిస్తాయి. ఈ లక్షణాలను మందుల ద్వారా నియంత్రించే శాస్త్రీయపద్ధతిని Detoxification అంటారు. ఈ దశ తర్వాత 15 రోజుల పాటు కరీముల్లా మద్యపాన సమస్య కలవారికి నిర్వహించే సామూహిక చికిత్స (Group therapy) లో పాల్గొన్నాడు. అయితే ఇన్ని ప్రయత్నాల తరువాత కూడా కరీముల్లా ఒక రోజు తాగి, తన ఇంటికి వెళ్ళాడు. దీనితో తన భార్య తీవ్ర మనస్తాపం చెంది కరీముల్లా ని వెంటనే తిరిగి MGICMH తీసుకురావడం జరిగింది. అదృష్టవశాతూ కరీముల్లా మద్యపానం వెంటనే మానివేసి, ప్రతి వారం జరిగే సామూహిక చికిత్సలకు హాజరు అయ్యాడు. కరీముల్లా ఆర్థిక పరిస్థితి దారిద్రరేఖ (poverty line) కు ఎగువ ఉండటం వలన, ఇతర పేషెంట్స్ కంటే కాస్త ఎక్కువగా చెల్లించవలసి వచ్చింది.
Satish is a 27 year married but separated young man who lives with his parents and a brother in a small village in Guntur district. The family owns half acre of farm land and leases out 4 acres of land to grow paddy. Satish’s wife has been living with her parents in a different town together with her daughter for the last 2 years. Since then Satish has been living with his parents. His symptoms started gradually as he started to believe that his own family had conspired against him and his wife and were the reason for his wife’s departure. He became more and more isolated and withdrew himself from his work responsibilities at the farm land. Gradually he stopped eating and drinking as well. In Sept 2010, he was brought to MGICMH, Guntur for assessment and treatment. Satish has been diagnosed to suffer from Paranoid Schizophrenia with paranoid delusions against his family members. He needed 45 days of inpatient care which helped him to gain weight up to 43 KGs from 30 KGs at the time of admission. He refused to take medication following discharge. Despite a home visit to his village (50 kms away from Guntur), he remained adamant that he did not need medication. Due to this reason he relapsed and needed a second admission in May 2011 again for refusing to eat and drink. He was started on depot antipsychotic during this admission. It transpired that due to severe loss of weight, his in-laws were suspicious that he may be suffering from AIDS. Social interventions like liaising with his in-laws and educating them with information about Satish’s illness were done with partial success. Satish has been discharged to his parental home again with a follow up plan on outpatient basis.
27 సంవత్సరాల సతీష్ తన తల్లితండ్రులు, తమ్ముడితో కలిసి గుంటూరు జిల్లాలో ఒక చిన్న గ్రామంలో ఉంటాడు.. సతీష్ కుటుంబానికి ఉన్న అర ఎకరం సొంత భూమితో పాటు మరో 4 ఎకరాలను కౌలుకు తీసుకోవడం ద్వారా వరి సైద్యం చేస్తూవుండేవారు. సతీష్ భార్య 2 సంవత్సరాల క్రితం సతీష్ తో వేరయి, తన తల్లితండ్రులతో మరియు కూతురితో కలసి వేరొక పట్టణములో వుంటున్నది. ఇలాంటి పరిస్థితులలో సతీష్ కు మానసిక వ్యాధి లక్షణాలు బయట పడటం జరిగింది. ముందుగా తాను అతని భార్య నుంచి వేరుపడటానికి తన కుటుంబసభ్యులూ కారణం అని నమ్మడం ప్రారంభించాడు. తరువాత ఇతరుల నుంచి దూరముగా ఉంటూ పొలము పనులను పట్టించుకోవడం మానేసాడు. సతీష్ వ్యాధి లక్షణాలు క్రమేపి పెరగడం జరిగింది. కొన్నాళ్ల తరువాత తన తిండి, నీరు వంటి ముఖ్యావసరాలను కూడా అశ్రద్ధ చేయడం మొదలు పెట్టాడు. సెప్టెంబర్ 2010 లో సతీష్ ను అతని కుటుంబ సభ్యులు గుంటూరు లోని MGICMH కి పరీక్ష మరియు చికిత్స నిమిత్తం తీసుకువచ్చారు. సతీష్ స్కిజోఫ్రీనియా (Schizophrenia) వ్యాధి కారణంగా తన కుటుంబసభ్యుల మీద ఆకారణమైన అనుమానాలు కలిగి ఉన్నట్లు నిర్దారించారు. సతీష్ ను 45 రోజుల పాటు ఆసుపత్రి లో ఉంచి చికిత్స చేసారు. సతీష్ ఆసుపత్రి లో చేరినప్పుడు 30కేజీ ల బరువు ఉంటే ఈ 45 రోజుల చికిత్య కాలములో అది 43కేజీ లకు పెరిగింది. అయినప్పటికీ తన డిశ్చార్జ్ సమయానికి సతీష్ మందులు వాడటానికి నిరాకరిస్తూ ఉండేవాడు. MGICMH నుండి సిబ్బంది గుంటూరు 50 కి.మీ ల దూరములో ఉన్న తన గ్రామానికి వెళ్లి సతీష్ ని మందులు వాడటానికి ప్రోత్సహించారు. అయినా సతీష్ తనకు మందుల అవసరం లేదంటూ మొండిగా నిరాకరించేవాడు. మందులు మానివేయడం వల్లన వ్యాధి లక్షణాలు ఉద్ధృతమై May 2011 లో సతీష్ ను మళ్లీ ఆసుపత్రి లో చేర్పించారు, మునుపటి లాగే సరిగ్గా తినకపోవడం వల్ల చాల బరువును కోల్పోయాడు. ఈసారి సతీష్ కి నెలకు ఒకసారి ఇచ్చే Depot ఇంజక్షన్ ద్వారా చికిత్స ప్రారంభించడం జరిగింది. సతీష్ అత్తింటి వారు సతీష్ బరువు కోల్పోవడానికి కారణమూ ఎయిడ్స్ (AIDS) అని సందేహించారు. MGICMH సిబ్బంది సతీష్ అత్తింటి వారితో మధ్యవర్తిత్వం జరిపి, వారికి కూడా అతని వ్యాధి పట్ల అవగాహన పెంచేందుకు ప్రయత్నించడం జరిగింది. దాని వల్ల కొంత ఫలితం లభించి, వాళ్లిద్దరూ తరువాత రోజులలో కలిసి ఉండటానికి దోహద పడింది. సతీష్ ని డిశ్చార్జ్ చేసి MGICMH out patient కి నిర్ణీత సమయములో తీసుకురావాల్సిందిగా అతని తల్లిదండ్రులకు సూచించడం జరిగింది. సతీష్ కు ఇప్పుడు చిన్న ఉద్యగం కూడా వచ్చింది. తన కుటుంబ అవసరాలను తాను చక్కగా చూసుకోగల్గుతున్నాడు.
The above cases illustrate the complex issues involved in supporting patients like Rajesh and Kamala whose families can never afford to provide the kind of treatment and support they received at MGICMH. We also noticed many families do not feel it is worth spending money for the treatment of mental illness. On the other hand none of the psychiatric services by the government are able to provide service as required by patients like Rajesh and Kamala where there was a need for assertive approach and additional efforts to educate the families.
పైన పేర్కొన్న ఉదాహరణలను గమనిస్తే రాజేష్, కమల, కరీముల్లా, సతీష్ వంటి వారి చికిత్స ఎంత సంక్లిష్టమైనదో తెలుస్తుంది. MGICMH అందచేసిన చికిత్స మరియు సేవలు వేరే , అవగతమవుతుంది. ఆర్ధిక కారణాల వలన, చాలా కుటుంబాలు తమ కుటుంబ సభ్యులు మానసిక సమస్యలతో బాధ పడుతుంటే, చికిత్స చేయించడానికి వెనుకాడటం మేము అనేక సార్లు గమనించాం. అదేవిధంగా చాల ఆసుపత్రులలో ఎక్కువ ఫీజులు తీసుకుని కూడా, మానసిక వ్యాధిగ్రస్తులకు మరియు వారి కుటుంబసభ్యులకు వ్యాధి గురించిన అవగాహన కల్పించడం, చికిత్స లో భాగస్వాములు చేయడం వంటి అదనపు అంశాలపై కేంద్రీకరించడం సాధారణంగా జరగడం లేదు.