Counselling
Counselling service is available for people who drink alcohol in excess and notice several aspects of their lives are being affected negatively. They need physical examination, blood investigations and ultrasound scan of the liver.
Detoxification
Patients who are dependent on alcohol and have intention of stopping alcohol, benefit from in-patient detoxification. Withdrawal symptoms like shakes in hands and body, sweating, restlessness and fits, will need inpatient treatment to reduce the symptoms gradually in a safe environment. This may take from 5 days to 13 days, depending on the amount of alcohol, patient consumes.
Post-detoxification support
After stopping alcohol consumption, patients become highly vulnerable to relapse of their drinking habit. This is very important phase in treatment. We provide daily support on outpatient basis to the patients, who successfully completed their inpatient detoxification. We also run AA group for patients on every Sunday night.
We also provide support to the families of patients suffering from alcohol dependence.
మద్యం అలవాటు మాన్పించే సేవలు
కౌన్సిలింగ్
మద్యం అతిగా సేవిస్తూ, మద్యానికి బానిసగా మారడం వలన, వారి జీవితాలలో అనేక దృక్కోణాలపై ప్రతికూల ప్రభావం పడిన వారి కోసం, మా వద్ద కౌన్సిలింగ్ సేవలు కలవు. మొదట శారీరకంగా పరీక్షించి, రక్త పరీక్షలు మరియు కాలేయము (లివర్) ఆల్ట్రాసౌండ్ స్కాను చేయించ వలసి ఉంటుంది.
మద్యం ఆపగానే కలిగే శారీరక లక్షణాలను తగ్గించడం
మద్యానికి బానిసగా మారిన వారు, ఈ అలవాటును పూర్తిగా మానుకుని, బాగుండాలని కోరుకునే వారికి ఇన్-పేషెంట్ గా ట్రీట్ మెంట్ ఇవ్వవలసి ఉంటుంది. చేతులు వణకడం, చెమటలు పట్టడం, కుదురు లేక పోవడం, వాంతి వచ్చినట్లు అనిపించడం ఫిట్లు రావడం వంటి శారీరక లక్షణాలు తగ్గించడం కోసం, సురక్షాకరమైన వాతావరణం లో ట్రీట్ మెంట్ ఇవ్వడం కోసం ఇన్-పేషెంట్ ట్రీట్ మెంట్ అవసరం. పేషెంట్ యొక్క సమస్య ఎంత వరకు ముదిరిందో, దాని బట్టి 5 నుండి 13 రోజుల వరకూ ఇన్-పేషెంట్ చికిత్స అవసరం అవుతుంది.
శారీరక లక్షణాలు తగ్గిన తర్వాత అవసరమైన చేయూత
మద్యం పూర్తిగా మానివేసిన తర్వాత, పేషెంట్ మళ్లీ త్రాగుడు మొదలు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే త్రాగుడు మానడంలో, ఇది ఒక ముఖ్యమైన దశ. ఈ దశలో అలా జరగకుండా ఒక సారి ఇన్-పేషెంట్ దశ విజయవంతంగా పూర్తి అయిన తర్వాత, ప్రతిరోజూ ఔట్-పేషెంట్ గా మేము చేయూతనిస్తాము. మేము ప్రతి ఆదివారం రాత్రి మద్యం మాని వేసిన వారికి AA గ్రూపు నడుపుతున్నాము.
మేము మద్యపానం అలవాటుతో, చెడు ప్రభావం పడిన కుటుంబాలకు కూడా చేయూతనిస్తాము.