
health unit which runs
as a not-for-profit
organisation based in
Guntur town,
Andhra Pradesh state,
India.

Welcome on behalf of MGICMH is a non-profit mental health unit managed by ‘Empower’ charitable trust based in Guntur, Andhra Pradesh State, India. Empower was registered in November 2008 under Indian Trusts Act 1882.
మహాత్మ గాంధి సమగ్ర మానసిక ఆరోగ్య సంరక్షణ సంస్థ (MGICMH) తరఫున మీ అందరికి స్వాగత సుమాంజలులు. ఈ సంస్థ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు పట్టణంలో వున్న ఎంపవర్ ట్రస్టు నిర్వహిస్తున్న లాభాపేక్ష లేని సంస్థ. ఎంపవర్ ట్రస్టు నవంబరు 2008 లో భారత ట్రస్టుల యాక్ట్ 1882 ప్రకారం రిజిస్టరు చేయబడినది.
Traditionally the psychiatric practice, be it in public or private sector, remained biological in nature for many years. This was leading to dissatisfaction in patients with mental health problems as many of them realised that taking just a pill is unlikely to resolve some of the psychological and social issues they have been suffering from.
మన ఇండియాలో సాధారణంగా మానసిక వ్యాధులకు చికిత్స కేవలం ‘శారీరకంగా’ (అంటే కేవలం మందులు ఇచ్చి ట్రీట్ మెంట్ చేయడం) అందిస్తున్నారు. ఈ పరిస్థితి ప్రభుత్వ / ప్రైవేటు రంగాలలో దరిదాపు ఒకే విధంగా వుంది.కానీ మానసిక సమస్యలు కలగడానికి శారీరక కారణాలతో పాటు, సైకలాజికల్ మరియు సాంఘిక పరమైన కారణాలు కూడా ఉంటాయి. అయితే కేవలం మందులతో మాత్రమే మానసిక సమస్యలకు చికిత్స చేసినప్పుడు, సైకలాజికల్ మరియు సాంఘిక పరమైన కారణాలకు పరిష్కారం లభించక, చికిత్స చేయించుకున్నా కూడా పూర్తి ఫలితాలు కనిపించక పేషెంట్లు అసంతృప్తికి గురి అవుతున్నారు.
Most psychiatric problems are contributed by bio-psycho-social factors and therefore it makes sense that the treatment plan should take bio-psycho-social aspects into consideration. It is an impractical expectation that all these three aspects of treatment and care are provided by the psychiatrist alone. The Royal College of Psychiatrists advocates the view that the comprehensive mental healthcare is best delivered through a multidisciplinary mental health team model.
దరిదాపు అన్ని మానసిక సమస్యలకు వివిధ పాళ్ళలో శారీరకపరమైన, మానసికపరమైన మరియు సాంఘికపరమైన కారణాలు ఉంటాయి. అందుకే ప్రతి పేషెంటు సమస్యలను మరియు వాటి కారణాలను సరిగా అర్థం చేసుకుని, ఆ పేషెంటు సమస్యలకు తగిన విధంగా వివిధ పాళ్లలో శారీరకపరమైన, మానసికపరమైన మరియు సాంఘికపరమైన మెళకువలను కలగలిపి ట్రీట్ మెంట్ ఇవ్వవలసి ఉంటుంది. అయితే మరి అన్ని రకాలైన ట్రీట్ మెంట్ మెళకువలు ఒక్క సైకియాట్రిస్ట్ మాత్రమే అందించగలడు అనుకోవడం ఆచరణ సాధ్యం కాని పని. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన రాయల్ కాలేజ్ ఆఫ్ సైకియాట్రిస్ట్స్ నిర్దేశించిన పద్ధతి ప్రకారం, మానసిక సమస్యలకు సంబంధించి ఒక మల్టి డిసిప్లినరీ టీమ్ – బహుళ విభాగ టీమ్ (అంటే వివిధ ప్రత్యేకతలు కలిగిన సభ్యులతో కూడిన టీమ్) ఉంటే, మానసిక సమస్యలను అత్యుత్తమ విధానంలో సమర్థంగా ట్రీట్ మెంట్ చేయడానికి వీలు కలుగుతుంది. అంటే సైకియాట్రిస్టుతో పాటు సైకాలజిస్టు, మానసిక సమస్యల విభాగంలో శిక్షణ పొందిన నర్సులు, సోషల్ వర్కర్లు, ఆక్యుపేషనల్ థెరపిస్టులు, ఫార్మసిస్టు, కేర్ వర్కర్లు అందరూ కలిసి ఒక టీమ్ గా ఏర్పడి ప్రతి పేషెంటుకు, అతనికి / ఆమెకు వున్న సమస్యలకు తగ్గట్లు, వివిధ సభ్యులకు వున్న నైపుణ్యాల ఆధారంగా ట్రీట్ మెంట్ చేయాలి. అప్పుడే అది సరి అయిన మానసిక వైద్య విధానం అవుతుంది.
Therefore, we started this hospital with an intention to provide psychological and social interventions in addition to biological methods with good evidence base.
అందుకే, శాస్త్రీయపరంగా నిరూపించబడిన శారీరకపరమైన విధానాలతో పాటు (అంటే మందులతో పాటు), సైకలాజికల్ (మానసికపరమైన) మరియు సోషల్ (సాంఘికపరమైన) విధానాలతో ట్రీట్ మెంట్ అందించాలనే ఉద్దేశంతో మేము ఈ ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది.
In addition, inaccessibility of good quality mental healthcare to patients from lower middle class and for people below poverty line has remained a matter of serious concern in a civilized society and country like India. Therefore, the main aim of Mahatma Gandhi Institute for Comprehensive Mental Healthcare (MGICMH) is to provide access of good quality mental healthcare to all sections of local community in Guntur and surrounding districts in the state of Andhra Pradesh, India. This is achieved by providing the treatment at a subsidized cost depending on the financial ability of patients. We agree that it is not an easy task to identify the true financial status of people. However, if we accept some degree of margin of error, our experience shows we could slot people in 4 different financial categories crudely. Although this is an issue, we feel it should not hamper our efforts in implementing this project.
అంతేకాక, ఉన్నత ప్రమాణాలతో కూడిన మానసిక వైద్యవిధానం మన భారత దేశం లో వున్న మధ్య తరగతి, నిమ్న వర్గాలకు చెందిన ప్రజలకు అందుబాటు లేకుండా పోవడం ఆందోళన కలిగించే విషయం. అందుకే మన భారత దేశంలోని ఆంధ్ర ప్రదేశ్ లో గుంటూరు మరియు చుట్టుపక్కల జిల్లాలలోని అన్ని వర్గాల వారికి, వారి ఆర్ధిక స్థోమత ఎలా వున్నా, అందరికీ అందుబాటులో ఉండే విధంగా మంచి ప్రమాణాలతో కూడిన మానసిక వైద్యం అందించడం అన్నది, మహాత్మ గాంధి సమగ్ర మానసిక ఆరోగ్య సంరక్షణ సంస్థ స్ధాపించడానికి ముఖ్య ఉద్దేశం. తక్కువ ఆదాయం కలవారికి ఫీజుల్లో రాయితీ ఇవ్వడం ద్వారా ఇది సాధ్య పడుతుంది. అయితే, మా దగ్గరకు వచ్చే పేషెంట్ల ఆదాయ పరిస్థితులను ఖచ్చితంగా అంచనా వేయడం అంత తేలికైన విషయం కాదు. ఈ పద్ధతిలో, మా వద్దకు వచ్చేవారి ఆర్థిక స్థాయి అంచనా వేయడంలో కొన్ని తప్పులు జరిగి కొంత నష్టం వాటిల్లినా, మేము అంతగా పట్టించుకోకుండా మా వద్దకు వచ్చిన పేషెంట్లకు వీలైనంత సహాయం చేస్తూ వస్తున్నాము. ఎలా అంటే, మా వద్దకు వచ్చిన పేషెంట్లను వారు ఇచ్చిన సమాచారాన్ని బట్టి నాలుగు రకములైన ఆదాయ వర్గాలుగా విభజించి, వారి ఆదాయ వర్గానికి తగ్గట్లుగా, వారికి ఫీజుల్లో రాయితీలు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా రాయితీలు ఇస్తూ ఆసుపత్రి నడపడం వలన మాకు కొంత ఆర్థికపరమైన సమస్యలు కలిగినప్పటికీ, కొంత మంది దాతల సౌజన్యంతో నష్టాలను పూడ్చుకుంటూ ఈ ప్రాజెక్టును కొనసాగిస్తున్నాము.