Smoking cessation service in Mahatma Gandhi Institute for Comprehensive Mental Healthcare, Guntur was inaugurated by the district collector sri K Suresh Kumar IAS on 16 November 2012. The occasion was also attended by the superintendent of police Sri Ake Ravikrishna IPS, the Municipal Commissioner Sri K Sudhakar, DM&HO Dr M Gopi Naik, Ex IMA AP State President Dr N Kishore, Guntur IMA President Dr N Satyanarayana, The Superintendent Guntur General Hospital Dr T Venugopala Rao. Several doctors in Guntur, members from general public and media correspondents also attended.
District Collector Sri K. Suresh Kumar explained the harmful effects of using tobacco products like cigarettes and ghutka. He also inaugurated equipment which measures carbon monoxide in breath.
SP Sri A. Ravikrishna explained the efforts by police to implement the COTPA 2003 act in preventing smoking in public places. He unveiled posters printed with pictures of harmful effects of use of tobacco.
Municipal Commissoner Sri Sudhakar unveiled pamphlets describing the harmful effects of tobacco use and the methodology of smoking cessation service.
16 నవంబరు 2012 న మహాత్మ గాంధి సమగ్ర మానసిక ఆరోగ్య సంరక్షణ సంస్థ, గుంటూరు లో పొగత్రాగడం, గుట్కా తినడం మాన్పించే సేవలను జిల్లా కలెక్టరు శ్రీ సురేష్ కుమార్ గారు ఆవిష్కరించారు. ఆ సందర్భంగా జరిగిన సభలో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ ఆకె రవికృష్ణ గారు, మునిసిపల్ కమిషనర్ శ్రీ కె సుధాకర్ గారు, జిల్లా వైద్యాధికారి డా. ఎం. గోపి నాయక్ గారు, ఐ ఎం ఏ ఏపీ రాష్ట్ర శాఖ పూర్వ అధ్యక్షులు డా. ఎన్. కిషోర్ కుమార్ గారు, ఐ ఎం ఏ గుంటూరు శాఖ అధ్యక్షులు డా. ఎన్. సత్యనారాయణ గారు మరియు గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. టి. వేణుగోపాలరావు గారు, నగర ప్రజలతో పాటు అనేక మంది పత్రికా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టరు శ్రీ సురేష్ కుమార్ గారు పొగాకుకు సంబంధించిన ఉత్పత్తులైన సిగరెట్లు మరియు గుట్కా వాడటం వలన కలిగే నష్టాలను వివరించారు. శ్రీ సురేష్ కుమార్ గారు ఈ సమావేశంలో శ్వాసలోని కార్బన్ మోనాక్సయిడ్ శాతాన్ని కొలిచే పరికరాన్ని ఆవిష్కరించారు.
జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ ఆకె రవికృష్ణ గారు మాట్లాడుతూ COPTA 2003 యాక్టు ప్రకారం బహిరంగ ప్రదేశాలలో పొగత్రాగడం నిషేధాన్ని అమలు చేయడానికి పోలీసు యంత్రాంగం చేస్తున్న కృషిని వివరించారు. శ్రీ ఆకె రవికృష్ణ గారు ఈ సందర్భంగా పొగత్రాగడం వలన కలిగే నష్టాలను చూపించే చిత్రాలను విడుదల చేసారు.
మునిసిపల్ కమిషనర్ శ్రీ కె సుధాకర్ గారు పొగత్రాగడం వలన కలిగే నష్టాలతో పాటు, పొగాకు అలవాటును మాన్పించే పద్ధతి వివరించే కరపత్రాలను విడుదల చేశారు.