The two major challenges we face in our work in India are lack of awareness of mental health issues and stigma about approaching a psychiatrist or any other mental health professional. These issues are generally linked with the level of education in the society and acceptance. Most patients lack insight into overall perspective about their problems and find it hard to link their symptoms to mental health issues. Most people think mind is a totally separate entity to body.
Educating people and making them aware that our thoughts and feelings are closely connected to our general well being and to our brain function, is the key challenge. To develop an understanding at a society level that attending a consultation with psychiatrist is not the same as being ‘mad’, is not an easy task to achieve, it requires lot of coordinated effort. Our attempt may be perhaps a ‘drop in a ocean’, but we will keep trying!
భారతదేశంలో మేము చేసే ఈ పనిలో మాకు ఎదురైన రెండు ముఖ్యమైన సవాళ్లు ఏమిటంటే మానసిక సమస్యల గురించి అవగాహన లేకపోవడం మరియు సైకియాట్రిస్ట్ ను సంప్రదించే విషయంలో చిన్న చూపు చూడటం. ఈ సమస్యలు మన సమాజంలో చదువు తక్కువగా ఉండటం మరియు ప్రజల అజ్ఞానంతో ముడిపడివున్నాయి. చాల మంది వారి జీవితాలలో కలిగే సమస్యలకు, వారికి కలిగే మానసిక సమస్యల లక్షణాలకు మధ్య వున్న సంబంధాన్ని గుర్తించలేరు. జనాభాలో అత్యధిక శాతం ‘శరీరం వేరు, మనసు వేరు’ అన్న అభిప్రాయం కలిగి వుంటారు.
ప్రజలకు మానసిక సమస్యల గురించి జ్ఞానం కలిగించడం ముఖ్యం. ప్రజలకు వారి ఆలోచనలు మరియు వారి భావోద్వేగాలు, వారి మెదడు యొక్క విధులతో సంబంధం కలిగి ఉంటాయి అన్న అవగాహన కలిగించాలి. ఇది వారి ఆరోగ్యానికి శ్రేయస్కరంగా ఉండటానికి ఈ విషయం చాల ముఖ్యం అన్న విషయం అవగాహన కల్గించడం మా ముందున్న అతి పెద్ద సవాలు. సైకియాట్రిస్టును సంప్రదించినంత మాత్రాన పేషంటుకు ‘పిచ్చి’ ఉన్నట్లు కాదు అనే స్థాయికి మన సమాజంలో అవగాహన పెంచే విధంగా చేయడం అంత తేలికైన విషయం కాదు. అలా జరగాలంటే చాల సమన్వయంతో కూడిన ప్రయత్నం చేయవలసి ఉంటుంది. మా ఈ ప్రయత్నం ‘సముద్రంలో ఒక నీటి బొట్టు’ మాత్రమే కావచ్చు, అయినా మేము ఈ ప్రయత్నాన్ని మా శక్తీ కొద్దీ కొనసాగిస్తాము.
[metaslider id=355]