Bipolar Disorder బైపోలార్ డిజార్డర్ – ఉన్మాద వ్యాధి 

What is Bipolar disorder?                                                                                                

Bipolar disorder is a disorder in mood, in which your mood can swing very high, or very low, for weeks or months. It used to be called Manic Depression.

బైపోలార్ డిజార్డర్ అంటే ఏమిటి?

భావోద్వేగాలు అతిగా ప్రభావితం అయ్యే మానసిక వ్యాధిని బైపోలార్ డిజార్డర్ అంటారు. ఈ వ్యాధి వున్నవారు కొన్ని వారాలు, నెలల పాటు ఉన్మాద స్థితి (Manic phase) లో వుండి, మరి కొన్ని వారాలు, నెలల పాటు కృంగుబాటు స్థితి (Depressive phase) లో వుంటారు.

Your mood can be any of the following states:                                                                    

 • low with intense depression and despair
 • high or ‘manic’ with elation, over-activity or anger
 • a ‘mixed state’ with symptoms of depression and mania.

మీరు బైపోలార్ డిజార్డర్ తో బాధ పడుతుంటే, మీ భావోద్వేగ స్థితి క్రింది విధంగా వుండే అవకాశం వుంది. 

 • విపరీతమైన నిరాశతో కూడిన కృంగుబాటు స్థితి (Depression)
 • కోపము, చిరాకు, అతిగా సంతోషంతో కూడిన ఉన్మాద స్థితి (Mania)
 • కృంగుబాటు స్థితి మరియు ఉన్మాద స్థితి, రెండిటి లక్షణాలు కలిసి వుండే స్థితి (Mixed state)

Bipolar disorder is less common than depression. It affects about 1 person in a 100.

కృంగుబాటు వ్యాధి కంటే బైపోలార్ డిజార్డర్ అరుదుగా కలుగుతుంది. బైపోలార్ డిజార్డర్ నూటికి ఒక్కరిలో కలుగుతుంది. 

WHAT CAUSES BIPOLAR DISORDER?                                                                                   

 • It seems to run in families, so there is hereditary component. Genetic causes are less common in the older persons.
 • There may be a physical problem with the brain systems which control mood.
 • Stress can precipitate episodes.

బైపోలార్ డిజార్డర్ కలగడానికి కారణాలు ఏమిటి?

 • బైపోలార్ డిజార్డర్ కొన్ని కుటుంబాలలో ఎక్కువగా కనబడుతుంది, అంటే జన్యుపరమైన కారణాలు ఉంటాయి. వృద్దాప్యంలో కలిగే బైపోలార్ డిజార్డర్ లో జన్యుపరమైన కారణాలు వుండే అవకాశం తక్కువ. 
 • కొన్నిసార్లు మెదడులో భావోద్వేగాలకు సంబంధించిన భాగంలో భౌతికంగా సమస్య వుండే అవకాశం వుంది. 
 • మానసిక వత్తిడి వలన బైపోలార్ డిజార్డర్ లో కలిగే భావోద్వేగ స్థితులు ప్రభావితం అయ్యే అవకాశం వుంది.

WHAT ARE THE SYMPTOMS OF BIPOLAR DISORDER? 

బైపోలార్ డిజార్డర్ లక్షణాలు ఎలా ఉంటాయి?

 

Symptoms during manic / hypomanic phase

ఉన్మాద స్థితి (manic phase) లో  కలిగే లక్షణాలు 

 • Too happy and excited  విపరీతమైన సంతోషం / హుషారు గా అనిపించడం 
 • Feel more important than usual  మామూలు పరిస్థితికి భిన్నంగా తనకు ప్రాముఖ్యం ఉందని అనిపించడం
 • Full of new and exciting ideas  కొత్త కొత్త ఆలోచనలు / హుషారైన ఆలోచనలు రావడం
 • Move quickly from one idea to another  మనసులో ఒక ఆలోచన నుండి మరో ఆలోచన లోనికి సత్వరంగా మారిపోవడం 
 • Full of energy  అతిగా శక్తి ఉన్నట్లు అనిపించడం
 • Don’t want to sleep  నిద్ర తగ్గిపోయినా నీరసంగా అనిపించకపోవడం 
 • More interested in sex  శృంగారంలో అదే పనిగా ఆసక్తి కలగడం 
 • Make unrealistic plans  ఆచరణ సాధ్యంకాని ప్రణాళికలు చేయడం 
 • Very overactive, talking quickly  అతి చురుకుతనం, మాటలు వేగంగా మాట్లాడటం 
 • Irritable with other people who can’t go along with your mood and ideas   మీ ఆలోచనలకు / భావోద్వేగానికి భిన్నంగా మాట్లాడే వారిపై చిరాకు అనిపించడం 
 • Spending more money   అతిగా డబ్బు ఖర్చు పెట్టడం 
 • Lose insight and be unaware of how ‘unwell’ you are   మీ మానసిక సమస్య / ప్రవర్తన పై అవగాహన లేక పోవడం 

Symptoms during depressive phase

కృంగుబాటు స్థితి (depressive phase) లో కలిగే లక్షణాలు

 • Feelings of unhappiness that don’t go away   త్వరగా వీడని విచారకరమైన ఆలోచనలు 
 • Agitation and restlessness   చికాకు మరియు మానసిక ప్రశాంతత లేక పోవడం 
 • Loss of self-confidence   తనపై తాను నమ్మకం కోల్పోవడం 
 • Feeling useless, inadequate and hopeless   చేతకానితనం, అసంపూర్తిత్వ భావనలు, నిరాశతో కూడిన ఆలోచనలు 
 • Thoughts of suicide   ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు 
 • Not able to think positively or hopefully   పాజిటివ్ గా ఆశావాదంతో ఆలోచించలేక పోవడం 
 • Can’t make decisions    నిర్ణయాలు తీసుకోలేక పోవడం 
 • Can’t concentrate, lose interest   ఏకాగ్రత లేకపోవడం, ఆసక్తి లేక పోవడం 
 • Can’t eat, lose weight  ఆకలి తగ్గి తిన లేక పోవడం, బరువు కోల్పోవడం
 • Can’t sleep properly, wake early in the morning  సరిగా నిద్ర రాకపోవడం, అలవాటు కంటే ముందరే నిద్ర నుండి మెలకువ రావడం 
 • Go off sex   శృంగారంలో ఆసక్తి తగ్గిపోవడం 
 • Avoid other people    ఇతరులతో మాట్లాడే సందర్భాల నుండి కావాలని తప్పించుకోవడం 

TREATMENT   ట్రీట్ మెంట్ 

Treating mania / hypomania : lithium, antipsychotics and sodium Valproate are the medications most commonly used. Sodium valproate should not be prescribed to women of child-bearing age.

ఉన్మాద స్థితి కొరకు లభించే చికిత్స – లిథియం, యాంటీ సైకోటిక్స్ మరియు సోడియం వాల్ ప్రోయేట్ వంటి మందులతో చికిత్స ఇవ్వబడుతుంది. సాధారణంగా పిల్లలు కలిగే వయసులో వున్న ఆడవారికి సోడియం వాల్ ప్రోయేట్ తో చికిత్స ఇవ్వకూడదు.

Treating depression: antidepressants should be used carefully as they can make people go high. It’s best to stop them as soon as the depression goes away.

కృంగుబాటు స్థితి కొరకు లభించే చికిత్స – కృంగుబాటు స్థితిలో వున్న పేషంట్ లకు యాంటీ డిప్రెసెంట్స్ తో చికిత్స చేయవలసి వస్తే, చాల జాగ్రత్తగా డోసులు ఇవ్వవలసి ఉంటుంది, లేకపోతే వారిని ఉన్మాద స్థితిలో నెట్టివేసే ప్రమాదం వుంది. కృంగుబాటు స్థితి నుండి బయటకు రాగానే యాంటీ డిప్రెసెంట్స్ ఆపి వేయవలసి ఉంటుంది.

Psychological treatments: these can also help. Methods include:

సైకలాజికల్ చికిత్సలు – బైపోలార్ డిజార్డర్ కొరకు క్రింది విధములైన సైకలాజికల్ చికిత్సలు ఉపయోగపడతాయి.

Psycho-education: learning about the condition and how to control it.

సైకో ఎడ్యుకేషన్ – బైపోలార్ డిజార్డర్ గురించి సరైన అవగాహన కల్పించడం మరియు ఈ వ్యాధి ని ఎలా నియంత్రించాలో క్షుణ్ణంగా తెలియచేయడం.

Mood monitoring: you learn to notice when your mood is starting to change.

మూడ్ మానిటరింగ్ – భావోద్వేగాలను పర్యవేక్షించడం – మీ భావోద్వేగాలతో తేడా వచ్చినపుడు వెంటనే గుర్తించడం నేర్చుకోవడం వీలవుతుంది.

Cognitive Behavioural Therapy to prevent a full blown manic or depressive episode.

కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ – తీవ్రమైన ఉన్మాద / కృంగుబాటు స్థితులను నిరోధించడం కొరకు ఉపయోగపడుతుంది.

 

SELF HELP   స్వీయ సహాయం

 • Learn to spot the early warning signs so you can get help early.
 • సమస్యకు సంబంధించిన లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించడం నేర్చుకొనండి.
 • Find out as much as you can about bipolar disorder.
 • బైపోలార్ డిజార్డర్ గురించి వీలైనంత ఎక్కువగా సమాచారం తెలుసుకోండి. 
 • Be aware of how stress affects you.
 • మానసిక వత్తిడి మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుందో అవగాహన కల్పించుకోండి.   
 • Have at least one person that you can rely on and confide in – someone who can warn you if you think you are not well.
 • మీకు తెలిసినవారిలో కనీసం ఒక్క వ్యక్తి పైన అయినా నమ్మకం పెంచుకుంటే, మీ మానసిక ఆరోగ్యం బాగో లేనప్పుడు మీ ప్రవర్తనలో వచ్చిన మార్పుల గురించి మిమ్మల్ని హెచ్చరించడానికి మీకు ఉపయోగపడతారు.
 • Balance your life and work, leisure, and relationships.
 • మీ జీవితంలో ఉద్యోగం, విశ్రాంతి మరియు సంబంధబాంధవ్యాల సంతులనం సరిగా వుండే విధంగా చూసుకోండి.
 • Do things that you enjoy and that give your life meaning.
 • మీకు ఆనందం కల్గించే పనులు చేస్తూ, మీ జీవితాన్ని అర్థవంతంగా గడపండి. 
 • Don’t stop medication suddenly. If you feel strongly about stopping your mental health medication, it is better to stop it gradually with the advice of your doctor.
 • మీరు మానసిక సమస్యలకు వాడే మందులను ఒక్కసారిగా ఉన్న పళంగా వాడటం ఆపవద్దు. మీకు మందులు వాడటం ఇష్టం లేకపోతే మీ డాక్టరు గారి సలహాతో కొద్ది కొద్దిగా డోసు తగ్గించడం మేలు. 
 • You may find it useful to keep a diary to record your daily mood.
 • మీ భావోద్వాగాలను ఒక డైరీలో రాసుకొంటే, మీకు ఉపయోగకరంగా ఉంటుంది.
 • Try to eat a healthy diet and to sleep well.
 • ఆరోగ్యకరమైన ఆహారం తినండి మరియు సుఖంగా నిద్రించండి. 
 • If you drink alcohol, stick to the safe limits. It is not safe to drink alcohol, if you are suffering from a mental disorder. It is harmful to your health, if you drink alcohol while you take medication for your mental disorder.
 • మీరు మద్యం సేవిస్తే, తక్కువ మోతాదులో సేవించండి. మద్యం ఎక్కువ మోతాదులో సేవిస్తే మీ మానసిక ఆరోగ్యం ఇంకా చెడుతుంది. మీరు మానసిక సమస్యకు మందులు వాడుతూ మద్యం త్రాగితే, అది మీ ఆరోగ్యానికి ఎక్కువ నష్టం కలిగిస్తుంది.