What is dementia?

Dementia is a condition which affects the brain & it’s functions like memory, orientation (awareness of time, place & person), language, attention & concentration and Visuo-spatial abilities (ability to recognise shapes & measurements). Patients with dementia present with a set of symptoms which are progressive in nature and there is gradual deterioration of functional abilities until the death.

డిమెన్షియా అంటే ఏమిటి?

డిమెన్షియా మెదడుపై మరియు దాని విధులపై ప్రతికూల ప్రభావం చూపించే ఒక వ్యాధి. వ్యాధి సోకిన వారి మెదడుకు సంబంధించిన విధులు, అంటే ఉదాహరణకు జ్ఞాపకశక్తి, సమయం, స్థలము మరియు దిశలను గుర్తించే శక్తి, మనం మాట్లాడే భాష, ధ్యాస మరియు ఏకాగ్రత, ఆకారాలను మరియు కొలతలను గుర్తించే శక్తి, వంటివి దెబ్బ తింటాయి అన్న మాట. డిమెన్షియా సోకిన పేషంటు లో పైన పేర్కొనబడిన లక్షణాలు క్రమక్రమంగా పెరుగుతూ పోవడమే కాక, వారి సాధారణ విధులను నిర్వర్తించే శక్తి కూడా క్రమక్రమంగా తగ్గిపోతుంది.

What are the actual symptoms?

Usually it starts with problems in ability to pay attention and to concentrate. Then this affects short term memory (recent memory is affected but remote memories are preserved during initial part of illness). Patients with dementia find it difficult to appreciate the date, day, month and year etc. They appear confused. Family may see this a gradual loss of interest of the patient in day to day activities.

డిమెన్షియా లక్షణాలు అసలు ఎలా ఉంటాయి?

డిమెన్షియా వ్యాధి సోకినప్పుడు మొట్ట మొదట సాధారణంగా ధ్యాస మరియు ఏకాగ్రత దెబ్బ తింటాయి. దశలో వ్యాధిని గుర్తించడం కష్టం. తర్వాత ఇటీవల జరిగిన విషయాలు త్వరగా మర్చిపోవడం (ఎప్పుడో జరిగిన విషయాలు మాత్రం వ్యాధి మొదటి దశలో గుర్తుంటాయి). డిమెన్షియా వ్యాధిగ్రస్థులు క్రమంగా సమయం, స్థలం మరియు దిశలను గుర్తించే శక్తిని కోల్పోతారు. చెప్పాలంటే ఒక రకంగా వ్యాధి సోకినవారికి అంతా అయోమయంగా, అగమ్యగోచరంగా అనిపిస్తుంది. రోగి దైనందిన కార్యక్రమాలలో క్రమంగా ఆసక్తి కోల్పోవడాన్ని కుటుంబసభ్యులు గమనిస్తారు.

What other symptoms will occur in dementia?

Forgetting becomes very prominent. Affected patients forget appointments, misplace money, glasses and walking stick etc. There is repetition in speech. They keep repeating the same question although you answered them because they can’t remember the answer. Their ability to count will be lost. They find it difficult to find right words to explain and gradually language abilities are lost. Writing will also be affected, for example, they lose ability to write checks. They find it hard to understand other people’s conversations.

డిమెన్షియాలో ఇంకా ఏమి లక్షణాలు ఉంటాయి

మతిమరుపు అన్నిటికన్నా ప్రముఖమైన లక్షణం. ఉదాహరణకు, డిమెన్షియా వ్యాధిగ్రస్థులు అపాయింట్మెంట్లు, ముందుగా చేసుకున్న ఏర్పాట్లు వంటివి మర్చిపోవడం జరుగుతుంది. డబ్బులు, కళ్లజోడు, ఊతకర్ర వంటివి ఒక చోట పెట్టి మరో చోట వెతకటం చేస్తుంటారు. చెప్పిన మాటలు పదే పదే చెప్పడం జరుగుతుంది. జవాబు చెప్పినా కూడా గుర్తుండక పోవడం వలన, అడిగిన ప్రశ్నలు పదే పదే అడుగుతుంటారు. వీరిలో చిన్న చిన్న లెక్కలు కూడా చేయలేరు. చెప్పదల్చుకున్న పదాలు గుర్తుకు రావు, క్రమంగా భాషకు సంబంధించిన మెళకువలు దెబ్బతింటాయి. చేతిరాతపై కూడా ప్రభావం పడుతుంది. బ్యాంకు చెక్కులు రాయలేరు. క్రమంగా ఇతరులు ఏమి మాట్లాడుతున్నారో కూడా అర్థం చేసుకోవడం కష్టమౌతుంది.

What else can happen?

People lose abilities like cooking, bathing / showering, operating gas cooker, washing machine, microwave, shopping and cleaning etc. They forget the sequencing of the tasks in preparation of tea or food etc. They also lose sense of direction and so driving becomes risky. Their personality changes as if a stranger entered in the body. This leads to severe self neglect.

Wandering can occur I.e. Patients may go out any time regardless of whether it is day or night and lose their way. They may behave inappropriately with symptoms like aggressive behaviour, day-night sleep reversal, unable to recognise people and items. In severe stage patients lose ability to retain urine and faeces.

Patients with dementia will die within few years after the onset of the illness.

ఇంకా ఏమి జరగవచ్చు

వంట చేయడం, స్నానం చేయడం, గ్యాసు పొయ్యి వాడటం, వాషింగ్ మెషిన్ వాడటం, మైక్రోవేవ్ వాడటం, షాపింగ్ చేయడం, ఇల్లు శుభ్రం చేయడం వంటి పనులు చేసే సామర్ధ్యాలు క్రమంగా కోల్పోతారు. టీ లేదా భోజనం తయారు చేయడంలో చేయవలసిన పనుల క్రమం మర్చిపోతారు. వీరు దిశా జ్ఞానం కోల్పోతారు, ఇందువలన డ్రైవింగ్ కూడా చేయడం కూడా ప్రమాదకరంగా మారుతుంది. వీరి ప్రవర్తన, వ్యక్తిత్వం పూర్తిగా మారిపోయి అసలు మనిషేనా లేక ఇంకెవరైనా కొత్తవాళ్లు వీరి శరీరంలో ప్రవేశించారా అనే సందేహం కలుగుతుంది. క్రమంగా వీరు తమ బాగోగుల గురించి పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తారు.

రాత్రి, పగలు అన్న పట్టింపు లేకుండా ఇల్లు వదిలి బయట సంచరించడం మరియు దారి మర్చిపోవడం జరగవచ్చు. ప్రవర్తన అసందర్భంగా ఉండటం, రౌద్రంగా మాట్లాడటం, హింసాత్మకంగా ప్రవర్తించడం జరగవచ్చు. రాత్రి మెలకువగా ఉండి పగలు నిద్ర పోవడం, మనుషులను మరియు వస్తువులను గుర్తించక పోవడం జరుగుతుంది. తీవ్రమైన స్థితిలో మలమూత్రాలపై నియంత్రణ తప్పుతుంది.

డిమెన్షియా వ్యాధి సోకిన కొన్ని సంవత్సరాలలోపే వ్యాధిగ్రస్థులు మరణానికి గురౌతారు.

What are the types of dementia?

Most common variety is Alzheimer’s dementia followed by Vascular dementia. Less common varieties are Lewy body dementia, frontal lobe dementia so on and so forth.

డిమెన్షియా వ్యాధిలో ఉన్న రకాలు ఏమిటి?

ఆల్జీమర్ డిమెన్షియా అన్నింటికన్నా తరుచుగా సంభవిస్తుంది. తర్వాత వాస్కులర్ డిమెన్షియా సాధారణం. అరుదుగా సంభవించే రకాలలో లూయీ బాడీ డిమెన్షియా మరియు ఫ్రాంటల్ లోబ్ డిమెన్షియా ఉంటాయి.

What causes dementia?

Several diseases whic affect the brain can cause dementia (in the order of frequency) – Alzheimer’s disease, cardiovascular disease, Parkinson disease, normal pressure hydrocephalus, Pick’s disease, Creutzfeldt- Jacob disease etc.

డిమెన్షియా ఎందువలన కలుగుతుంది?

మెదడుపై ప్రభావం చూపే అనేక వ్యాధుల వలన డిమెన్షియా కలిగే అవకాశం ఉంది. (తరచుదనంలో క్రమంగా) అల్జీమర్ వ్యాధి, గుండె మరియు రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు, పార్కిన్ సన్ వ్యాధి, నార్మల్ ప్రెషర్ హైడ్రోసెఫాలస్, పిక్స్ వ్యాధి, క్రూట్జ్ ఫెల్ట్ వ్యాధి తదితరములైన వ్యాధులు కారణం కావచ్చు.

What are the risk factors for dementia?

Genetic factors, high blood pressure, obesity, Diabetes Mellitus, smoking, high cholesterol levels

డిమెన్షియా వ్యాధిని కలిగించే ప్రమాద కారకాలు ఏమిటి?

జన్యు కారకాలు, అధిక రక్తపోటు, ఊబకాయం, చక్కెర వ్యాధి, పొగ త్రాగడం, రక్తంలో అధిక కొలెస్టరాల్

How frequently can dementia occur?

The prevalence is quoted as 5% in people older than 65. The risk is doubled for people every 5 years as they get older.

డిమెన్షియా వ్యాధి ఎంత తరచుగా కలుగుతుంది

65 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు వున్న వారిలో 5 శాతం మందికి డిమెన్షియా వ్యాధి కలిగే అవకాశం వుంది. అయితే వయసు పెరిగే కొద్దీ, ప్రతి 5 సంవత్సరాలకు డిమెన్షియా వ్యాధి వచ్చే ప్రమాదం రెట్టింపు అవుతుంది.

Is there any treatment?

There is no cure for dementia yet. However, if you can find out the cause treatment can be given to control symptoms. For Alzheimer’s disease Cholinesterase inhibitors can be used. For vascular dementia, it is important to control high blood pressure, diabetes, obesity, high cholesterol and smoking.

డిమెన్షియా వ్యాధిని నయం చేయడానికి ఏదైనా చికిత్స వుందా?

డిమెన్షియా వ్యాధిని పూర్తిగా  నయం చేయడానికి ట్రీట్ మెంట్ ఇంకా అందుబాటులో లేదు. కాని, డిమెన్షియా కలగడానికి సరైన కారణం తెలిస్తే, జబ్బు లక్షణాలను నియంత్రించవచ్చు. ఉదాహరణకు, అల్జీమర్ వ్యాధి వలన డిమెన్షియా కలిగితేకోలినెస్టరేజ్ ఇన్ హిబిటార్స్వాడవచ్చు. వాస్కులర్ డిమెన్షియా కొరకు రక్తపోటును, చక్కర వ్యాధిని , ఊబకాయాన్ని, అధిక కొలెస్టరాల్ ను మరియు పొగత్రాగడాన్ని నియంత్రించవలసి ఉంటుంది.

How to manage patients with dementia?

  1. Thorough assessment and diagnosis by a specialist, preferably psychiatrist
  2. Medication for symptoms
  3. Supporting the patients and their families – this is the most crucial part of the management (educating the family of the condition and help them to manage the patient)
  4. Legal proceedings like power of attorney if necessary

డిమెన్షియా వ్యాధిగ్రస్తుల లక్షణాలను ఎలా నియంత్రించగలము?

  1. మొదట డిమెన్షియా వ్యాధిగ్రస్తులకు అందించే చికిత్సలో అనుభవం వున్న సైకియాట్రిస్ట్ చేత క్షుణ్ణంగా పరీక్షలు చేయించి, వ్యాధి నిర్ధారణ చేయించాలి.
  2. లక్షణాలను బట్టి మందులు వాడాలి.
  3. పేషంట్ కు మరియు కుటుంబ సభ్యులకు అవసరమైన మద్దతు ఇవ్వాలి వ్యాధికి అవసరమైన చికిత్సలో ఇది అన్నింటికంటే చాలా ముఖ్యమైన భాగం. కుటుంబ సభ్యులకు వ్యాధి గురించి పూర్తి అవగాహన కల్గించి, పేషంట్ తో ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఎలా సహాయపడాలి వంటి విషయాలు తెలియజేయాలి.
  4. ఆస్తులకు సంబంధించి సరైన లాయర్ వద్ద సహాయం పొందే విధంగా పేషంటుకు, కుటుంబసభ్యులకు సలహా ఇవ్వాలి.