What is Schizophrenia?
Schizophrenia is a mental illness, which affects brain. Therefore, it affects thought process and perceptions in a distorted way, which appear real to the person with Schizophrenia, which in turn affects the person’s behaviour leading to difficult relationship with others and poor functionality in life. It tends to be chronic in course but with some degree of variability.
స్కిజోఫ్రీనియా అంటే ఏమిటి?
స్కిజోఫ్రీనియా మెదడుపై ప్రభావం చూపించే ఒక మానసిక వ్యాధి. దీని వలన స్కిజోఫ్రీనియా ఉన్న వ్యక్తి యొక్క ఆలోచించే విధానం మరియు వారికి కలిగే అనుభవాలను వారు అర్థం చేసుకునే విధానం వక్రీకరించబడతాయి. అందుకే ఇతరులతో వీరి సంబంధ బాంధవ్యాలు సక్రమంగా ఉండక పోవడమే కాక, జీవితంలో తమ గమ్యాలను అంతగా సాధించలేరు. వ్యక్తికీ వ్యక్తికీ మధ్య కొంత వ్యత్యాసం ఉన్నప్పటికీ, ఈ వ్యాధి దీర్ఘకాలికంగా వుండే అవకాశం వుంది.
What are the symptoms of Schizophrenia?
- Hallucinations – For example, hearing voices when no one is around and responding to voices, smiling and talking to self, seeing things which other people can’t see, etc.
- Delusions – Fixed and unshakable beliefs even in the face of evidence in contrary
- Suspicions – strong beliefs of being harmed or targeted by someone else
- Beliefs that their mind and body is under control of someone else
- Outbursts of extreme anger, Violent behaviour
- Poor selfcare – ability to look after one’s own self is diminished
- Poor functionality in life
స్కిజోఫ్రీనియా లక్షణాలు ఎలా ఉంటాయి?
– భ్రాంతులు – ఉదాహరణకు, ఎవరూ చుట్టుపక్కల లేకపోయినా మాటలు వినపడటం, సంభాషించడం, తనలో తాను నవ్వుకోవడం, మాట్లాడుకోవడం, ఎవరికీ కనపడని వస్తువులు, మనుషులు వారికి మాత్రమే కనపడటం, లాంటివి..
– అపప్రథలు – సాక్ష్యాధారాలు లేకుండా అచంచలమైన మరియు స్థిరమైన ఆలోచనలు కలిగి ఉండటం.
– అనుమానాలు – తనను లక్ష్యంగా చేసుకుని ఎవరైనా హాని చేస్తారేమో అని గట్టిగా నమ్మడం. – తన మైండ్ వేరే వారి కంట్రోల్ లో ఉన్నట్లు భావించడం. – విపరీతమైన కోపం రావడం, హింసాపూరితమైన ప్రవర్తన.
– తన బాగోగులు తాను చూసుకునే సామర్థ్యం తగ్గి పోవడం / పట్టించుకోకపోవడం, వ్యక్తిగత శుభ్రత తగ్గిపోవడం.
– జీవితంలో ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించలేకపోవడం.